BSNL యొక్క చవకైన లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ఇదే ..!!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 15 Jul 2022
HIGHLIGHTS
  • BSNL యొక్క అత్యంత చవకైన లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్

  • ఈ ప్లాన్ తో మరిన్ని లాభాలను కూడా రీఛార్జ్ చేసే కస్టమర్లు పొందవచ్చు

  • ఈ ప్లాన్ రోజూ 2GB హై స్పీడ్ డేటా మరియు ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది

BSNL యొక్క చవకైన లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ఇదే ..!!
BSNL యొక్క చవకైన లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ఇదే ..!!

BSNL యొక్క అత్యంత చవకైన లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే, మీరు బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.797 ప్లాన్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే, బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ రూ.797 ప్లాన్ పూర్తిగా సంవత్సరం వ్యాలిడిటీ తో వస్తుంది. అంటే, 365 రోజుల వ్యాలిడిటీ కలిగిన లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ అన్నమాట. అంతేకాదు, ఈ ప్లాన్ తో మరిన్ని లాభాలను కూడా రీఛార్జ్ చేసే కస్టమర్లు పొందవచ్చు. అందుకే, చవక ధరకే లాంగ్ వ్యాలిడిటీ, కాలింగ్ మరియు డేటా లాభాలను అఫర్ చేస్తున్న ప్లాన్ గురించి ఈరోజు చూద్దాం.

BSNL యొక్క రూ. 797 ప్రీపెయిడ్ ప్లాన్ ఏకంగా 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో రోజూ 2GB హై స్పీడ్ డేటా మరియు ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ ను అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే, రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది. అయితే, ఈ ప్లాన్ తో అందించే Freebies మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. అలాగే, ఇతర ఆఫర్లతో పాటుగా వచ్చే కాలర్ ట్యూన్ సర్వీస్ ఉచిత యాక్సెస్ మాత్రం ఈ ప్లాన్ కు వర్తించదు.

పైన తెలిపిన ప్లాన్ తో పాటుగా మరోక బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను కూడా వుంది. అదే రూ.397 ప్రీపెయిడ్ ప్లాన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.  ఎందుకంటే, ఈ అఫర్ తో BSNL కస్టమర్లకు కేవలం 397 రూపాయలకే  పూర్తి 200 రోజుల వ్యాలిడిటీని అఫర్ చేస్తుంది.ఈ ప్లాన్ బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమౌంట్ ని రోజుల లెక్కన లెక్కగడితే, రోజుకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతుంది.

ఈ అఫర్ ముందు నుండే  అందుబాటులో వుంది మరియు BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ఆఫర్లలో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ప్లాన్ తో మరిన్ని ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. BSNL యొక్క ఈ 397 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా 200 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

అయితే, ఈ అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS  మరియు డేటా లిమిటెడ్ డేస్ కోసం మాత్రమే. ఈ రీఛార్జ్ చేసే కస్టమర్లకు వ్యాలిడిటీ 200 రోజులు, అంటే అర్ధ సంవత్సరం లభించినా, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS సర్వీస్ లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

మరిన్ని BSNL ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: Bsnl best long validity plans in Telugu states
DMCA.com Protection Status